ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం మంథని ఆర్డిఓ కార్యాలయంలో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు జరుగుతాయని, దీనికి సంబంధించి మన జిల్లాలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి వీలైనంత త్వరగా సమర్పించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) సురేష్, ఆర్ అండ్ బి ఈఈ భావ్ సింగ్, మిషన్ భగీరథ ఈఈ ఇంట్రా శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గోన్నారు.
Admin
E Nivas News