Friday, 11 September 2026 07:39:12 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

రైస్ మిల్లర్లుబియ్యాన్ని త్వరగా అందించాలి... కలెక్టర్ కుమార్ దీపక్

Date : 08 September 2026 09:57 PM Views : 37

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బియ్యాన్ని త్వరగా అందించాలని మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం అంకుశాపూర్ గ్రామంలో గల సమతా రైస్ మిల్ ను ఆకస్మికంగా సందర్శించి రైస్ మిల్లు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యాన్నిసామర్థ్యానికి అనుగుణంగా రైస్ మిల్లులకుకేటాయించడం జరిగిందని, రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలనిl తెలిపారు. మండలంలోని మద్దికల్ గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రతి రోజు తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, మురుగు కాలువలలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని తెలిపారు. నీటి నిల్వలు లేకుండా శుభ్రపరచాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేయాలని, నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మించిన ఇండ్లకు మాత్రమే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేసుకునేలాఅధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామంలో కొంతమంది రైతులు వరి సాగు చేయడాన్ని గమనించి వారితో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. పంట సాగుకు బోర్లు, చెరువు అందుబాటులో ఉండడంతో వరి సాగు చేస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియలో నిర్దేశిత విధానాలను పాటించాలని, ఫీల్డ్ రిజిస్టర్, విలేజ్ రిజిస్టర్ లలోవివరాలునమోదు చేస్తూ సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రీ సర్వే పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరేపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించివిద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల జారీ, విచారణ కార్యక్రమాలనిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిపాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తయారీలో శుభ్రత నిబంధనలుపాటించాలని సిబ్బందికి సూచించారు. 6వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించి స్వయంగా వారికి పాఠ్యాంశాలు బోధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టిక, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధనoచేయాలని సూచించారు. నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో మండల తహసిల్దార్ సదానందం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీణ, సంబంధితఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: