ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3వ తేదీకి న్యాయ స్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని మార్చాలనే సింగిల్ బెంచ్ ఆర్డర్ ను తాత్కాలికంగా డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాల వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లవద్దని హై కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై అప్పీల్‌కు హైడ్రా కమిషనర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే కేసులో రంగనాథ్‌ని తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి గతంలో తీర్పునిచ్చారు. ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి తీర్పుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.
Admin
E Nivas News