ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ మద్యం ప్రియులు మందు తాగకుండానే మత్తె క్కించే షాక్ ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు రేవంత్ రెడ్డి, సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది.ఈ మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ తర్వాత ఈ మద్యం ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో విక్రయించే అన్ని రకాల మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుండి 15% మేర ఈ ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచు కోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతు న్నట్లు తెలుస్తుంది, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆమాంతం పెరిగాయి. దీంతో మద్యం సీసాల తయారీకి అవసర మైన ఎల్పీజీ సహజ వాయువు కొరత ఏర్పడింది. గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తాము నష్టపోతున్నామని, ధరలను సవరించా లని డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు గతేడాది కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచడంతో ఈ నిర్ణయం తీసు కున్నట్లు తెలుస్తుంది.
Admin
E Nivas News