Tuesday, 15 September 2026 02:30:39 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్యార్థుల అభ్యసన సామర్త్యాలు మెరుగుపరచాలి

Date : 23 October 2025 07:38 PM Views : 314

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ ఎల్ ఎన్) నైపుణ్యాలపై దృష్టి సారించి, ప్రత్యేక పఠన మెరుగుదల ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడం, అక్షరాస్యతను అభివృద్ధి చేయాలని అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో గత సంవత్సరంలో పేలవమైన పనితీరును కనబరిచిన పాఠశాలలపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని, రాబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎం.ఈ.ఓ లు మండలంలోని ప్రతి పాఠశాలను ఖచ్చితంగా సందర్శించి ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి, రికార్డు పరంగా అన్ని అంశాలపై చర్చించాలని, విద్యార్థులకు బోధనా పద్దతులను, సందేహాల నివృత్తి, విద్యార్థుల హాజరు శాతం మెరుగుదల వంటి అంశాలపై సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మంచి ఫలితాలను రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ప్రతి సబ్జెక్టులో ఉత్తములుగా తీర్చిదిద్దాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడితో శిక్షణ ఇప్పించి విద్యార్థి యొక్క సందేహాలను నివృత్తి చేసి ప్రతిభావంతునిగా తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లాలో సబ్జెక్టుల వారిగా ప్రత్యేక ప్రతిభా పాఠవాలు కలిగిన ఉపాధ్యాయులతో పాఠాలు భోదించి విద్యార్థుల పఠన సామార్త్యాన్ని పెంచాలన్నారు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అంతకు ముందు సంవత్సరం ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి పాఠశాలపై ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను సమయానుకూలంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: