ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలకు సంబంధించిన ధూప దీప నైవేద్యాలు పథకం మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రిని కోరగా వెంటనే నియోజకవర్గంలోని 24 దేవాలయాలకు గురువారం (DDNS) ధూప దీప నైవేద్యం పథకం మంజూరు చేసిన దేవాదాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని మంథని మండలం మల్లారం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, నాగారం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం, వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, బెస్తపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, ఎక్లాస్ పూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, సిరిపురం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, గుంజపడుగు గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం (శ్రీ రామ స్వామి గోపాల స్వామి దేవాలయం), చిన్నఓదెల గ్రామంలోని మర్రిపాడు అభయాంజనేయ స్వామి దేవాలయం, మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి గ్రామంలోని శ్రీ భక్త మల్లెపూల హనుమాన్ దేవాలయం, మంథనిలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం, రామగిరి మండలం పరిధిలోని పన్నూర్ గ్రామంలోని శ్రీ శివ వీర బ్రహ్మేంద్ర, శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయం, రత్నాపూర్ గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం, వకీల్ పల్లి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, ముస్త్యాల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, కమాన్ పూర్ మండలం గుండారం గ్రామం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, ఒడిపిలవంచ గ్రామంలోని శ్రీ భూనీల సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం, అంకుసాపూర్ గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, జగ్గయ్యపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, దామెరకుంట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, మహాదేవపూర్ మండలం పరిధిలోని కుదురుపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, బొమ్మాపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ సహిత శివ పంచాయతన్ దేవాలయం, ఎల్కేశ్వరం గ్రామంలోని శ్రీ అలకేశ్వర స్వామి దేవాలయాలకు ధూప దీప నైవేద్యం పథకం మంజూరైంది. ధూప దీప నైవేద్యం పథకం మంజూరుకు కృషిచేసిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖలకు పెద్దపెల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఆయా గ్రామాల ప్రజలు, అర్చకులు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపారు. మంథని నియోజకవర్గంలో చాలా పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా ఉన్న వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, మంథని నియోజకవర్గంలో ధూప దీప నైవేద్యం మంజూరు లేక దేవాలయాలు చాలా ఉన్నాయని వీటిని కూడా పరిశీలించి ధూప దీప నైవేద్యం పథకం మంజూరు చేయాలని శ్రీధర్ బాబు కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలోని ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Admin
E Nivas News