ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : యాదాద్రి జిల్లాలో చోటుచేసుకున్న భూ భారతి చలాన్ల దుర్వినియోగం కేసులో అధికారుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. కోట్ల రూపాయల విలువైన భూములకు లక్షల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.40 నుంచి రూ.50 మాత్రమే చలాన్ కట్టి, మిగతా సొమ్మును అక్రమంగా కాజేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ లావాదేవీల్లో భూ భారతి పోర్టల్‌ను ఉపయోగించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మోసం జరగదనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ భాగోతం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌లోని ఇంటర్‌ఫేస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా సాంకేతిక మార్పులు తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ స్కామ్‌లో ఇంకా ఎంత మంది పాత్రధారులు ఉన్నారు? ఎంత మేర నష్టం జరిగింది? అన్న అంశాలపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Admin
E Nivas News