Friday, 11 September 2026 10:18:37 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

బాలికల భద్రతపై అవగాహనతో పాటు సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం..

జూనియర్ కాలేజీలో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు..

Date : 21 August 2026 08:28 PM Views : 73

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, భరోసా కేంద్రం సేవలు మరియు మహిళా భద్రతపై షీ టీం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని షీ టీం ఎస్‌ఐ.సునంద, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ కరుణాకర్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీం, సైబర్ క్రైమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. షీ టీం సేవలు బాలికలకు భద్రతపై అవగాహన కల్పించారు. షీ-టీం ఎస్‌ఐ సునందషీ టీం విధులు, బాధ్యతలు, షీ టీంను ఏ విధంగా సంప్రదించాలి, షీ టీం సిబ్బంది నిర్వహించే విధులు, మహిళలు మరియు బాలికల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించి, గోప్యతతో ఎలా పరిష్కరిస్తారనే అంశాలను వివరించారు. అలాగే POCSO Act ప్రాముఖ్యత, బాలికల రక్షణకు చట్టపరమైన భద్రత, T-Safe App వినియోగం గురించి అవగాహన కల్పించారు. విద్యార్థినులు తమ లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో, శ్రద్ధగా చదువుకోవాలని, తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సునంద సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం ఉందన్నారు. సైబర్ క్రైమ్ ఎస్‌ఐ కరుణాకర్ వివిధ రకాల సైబర్ నేరాల గురించి విద్యార్థినులకు వివరించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు, ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటిపి లు వంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని, సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. భరోసా కేంద్రం సేవలపై అవగాహన కల్పించారు. భరోసా కేంద్రం సిబ్బంది భరోసా కేంద్రం అందించే సేవలు, విధులు మరియు బాధ్యతల గురించి విద్యార్థినులకు వివరించారు. మహిళలు, బాలికలు ఏవైనా వేధింపులు, హింస లేదా ఇతర సమస్యలకు గురైనప్పుడు భరోసా కేంద్రం ద్వారా పొందగల సహాయం, కౌన్సెలింగ్ మరియు ఇతర సేవల గురించి అవగాహనకల్పించారు మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి.. యాంటీ ట్రాఫిక్ హ్యూమన్ మానవ అక్రమ రవాణా అంటే ఏమిటి, అది ఏ విధంగా జరుగుతుంది, అక్రమ రవాణాకు గురయ్యే పరిస్థితులు ఏమిటి, దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకుసమాచారం అందించాలని సూచించారు.. బాలికలు చట్టాలపై అవగాహన కలిగి, సైబర్ నేరాలు, ఇతర ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తమ భద్రతతో పాటు సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు. ముఖ్యమైన హెల్ప్ లైన్ నెంబర్లు: అత్యవసర సహాయం: 112, మహబూబాబాద్ షీ టీం నెంబర్: 8712656935 , సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్: *1930* , చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్: *1098* మహిళ హెల్ప్ లైన్ నెంబర్: *181* , 600 మంది విద్యార్థినులకు అవగాహన.. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయ సిబ్బంది,సుమారు 600 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, సుధారాణి, ప్రియాంక, ఏ హెచ్ టి యు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నాయక్, అరుణ, భరోసా సిబ్బంది మౌనిక, బేబీ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :