Tuesday, 15 September 2026 06:22:15 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 14 October 2025 09:50 PM Views : 392

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట మండల కేంద్రాలలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో అన్ని సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ గైర్హాజరు అయినట్లయితే, అందుకు గల కారణాలను తెలుసుకోవాలని, విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పాఠశాల తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. సెలవులు పూర్తిచేసుకుని తిరిగి పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులను ఫోన్ లో సంప్రదించి విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చర్యం తీసుకోవాలని తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసనా సామర్థ్యాలను పరీక్షించారు. జిల్లాలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో విద్యనభ్యసించి నీట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నిర్మల్ జిల్లాలో ఎం.బి.బి.ఎస్. సీటు సాధించిన విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: