ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని బాలాజీ లాడ్జిలో మంగళవారం రాత్రి11:30 గంటల సమయంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ , పోలీస్ సిబ్బంది తో కలిసి లాడ్జిపై ఆకస్మిక దాడి చేసి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ ఆరుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టుబడ్డ నిందితులను నరేందుల సతీష్, రాందేని తిరుపతి, హేమంత్ కుమార్, ఏ సమ్మయ్య, ఏం హనుమంతరావు, సయ్యద్ అబ్బాస్, నల్మాస్ మణిదీప్ లుగా గుర్తించారు. నిందితుల వద్ద నుండి వద్ద నుండి యాభై రెండు పేక ముక్కలు, ఒక లక్ష ఇరవై వేల ఏడువందల డెబ్బై రూపాయల నగదు, ఆరు మొబైల్ ఫోన్స్, టి ఎస్ 19 హెచ్ 5838 నంబర్ గల స్కూటీ తో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.. ఆరుగురు నిందితుల పాటు లాడ్జి యజమాని పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.
Admin
E Nivas News