ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని దహెగాం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు శనివారం పాల్గొన్నారు. గత ప్రభుత్వం పది సంవస్సరాల్లో ప్రజలకు చేసేంది ఏమి లేదని,గ్రామాలను అభివృద్ధిచేసుకోవాలంటే ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ని గెలిపించుకుంటేఅభివృద్ధి జరుగుతుందన్నారు. పోయిన సర్కారు ఏఒక్క గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లను ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వం రెండు యేండ్లలో బోథ్ నియోజకవర్గనికి వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిందాన్నారు.ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నా కేసీఆర్ ఏఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం రెండు యేండ్లలో 60 వేలకు పైగా ఉద్యోగలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భారతి బాయి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామంలో ఏ అవసరం ఉన్న తనకు సంప్రదించాలని తాను ఎల్ల వేళల అందుబాటులో ఉంటానన్నారు. ప్రచార కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, గ్రంథాలయ చేర్మెన్ మల్లెపూల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News