ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ప్రతినెలా ఒకటో తేదీన ఇవ్వకుండా జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డి లోని బోధి పెవిలియన్ లో ఉన్నంత అధికారు లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడం తోపాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలనిసూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు అందేలా చూడాలని, ఇందుకోసం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సదరు ఉద్యోగుల వివరాలు, వారి జీతాలు, బ్యాంక్ ఖాతాల సమాచారా న్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ,ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పారు.
Admin
E Nivas News