ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల నెరవేరడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంథని మండలం మల్లెపల్లి గ్రామంలో ఆతుకూరి రజిత -సంతోష్ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కావడంతో శుక్రవారం ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసి పనులు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా వారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News