ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 80 వస్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆయా పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అలాగే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వారి వారి నియోజకవర్గాల్లో మువ్వన్నెల పథకాలను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాల లతోపాటు ప్రైవేటు యువజన సంఘాలు,వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పథకాలు ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది
Admin
E Nivas News