ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నిత్య హనుమాన్ చాలీసా పారాయణం భక్తులకు ఆత్మ విశ్వాసాన్ని అందిస్తుందని పట్టణ పురోహితులు వేద పండితుడు కొత్తపల్లి భరద్వాజ శర్మ అన్నారు. మంగళవారం స్థానిక హనుమాన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమాన్ భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా ఆ దేవదేవుడు హనుమంతుడు చల్లగా చూస్తాడన్నారు. రామాయణ కాలంలో రాముడికి ఎలా తన అండదండలు అందించాడో నేటి కలియుగంలో భక్తులకు అలాంటి అండ దండలు అందిస్తాడని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసా ను నిత్య పారాయణం చేయడం వల్ల భక్తులకు అంకిత భావం అలబడుతుందని పరులకు సేవ చేసే గుణం ఏర్పడుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా భక్త బృందం, భక్తులు, పాల్గొన్నారు.
Admin
E Nivas News