ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 2వ సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ నెల 6వ తేదీన జరిగిన శిక్షణ కార్యక్రమంలో హాజరవ్వని ఎన్నికల అధికారులకు సోమవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధులకు ఈనెల 10న ఉదయం పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. 11వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, సూపరింటెండెంట్ దేవేందర్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News