ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేటమండలంలో తొలి విడతలో ఎన్నికలు జరిగే 18 గ్రామ పంచాయతీలు, 160 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఇందుకోసం 6 కేంద్రాలను అందుబాటులో ఉంచగా మండలంలో 60 నామినేషన్లు దాఖలైనట్లు శుక్రవారం ఎంపీడీవో సరోజ తెలిపారు.ఇందులో సర్పంచ్ స్థానాలకు 24 మంది, వార్డులకు 36 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు.
Admin
E Nivas News