ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజ్ కుమార్ లను మంథనిలో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను జిల్లావ్యాప్తంగా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫాంలు ఇవ్వలేదని పాఠ్యపుస్తకాలు కూడా సరిపడా ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు రాక ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనె విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
Admin
E Nivas News