Monday, 14 September 2026 09:00:45 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జన్నారం ను నియోజకవర్గం చేయాలి...

గవ్వల శ్రీకాంత్ డిమాండ్..

Date : 25 March 2026 07:50 AM Views : 249

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా జన్నారం ను అసెంబ్లీ నియోజక వర్గం చేయాలని నియోజకర్గం సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన హరిత రిసార్ట్స్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ జన్నారం టైగర్ జోన్ పరిధిలో ఉండడం వలన అభివృద్ధిలో వెనుకబడిపోయిం దన్నారు. జన్నారం, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల నాలుగు జిల్లాలను కలుపుకొని కేంద్రంగా ఉన్న జన్నారం మండలం ఉంది కాని జన్నారం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 50% నియోజకవర్గాలుగా చేయాలని ఇదే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని భావిస్తున్న సందర్భంగా అన్ని రకాలుగా వెనుకబడిపోయిన జన్నారం మండలాన్ని పునర్విభజనలో భాగంగా జన్నారాన్ని అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మండల వాసులు ప్రజలు కార్మికులు కూలీలు రైతులు ఉద్యోగులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు ఆలోచించి ఉద్యమానికి సహాయ సహకారాలు అందించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమంలో పాల్గొని జన్నారం అసెంబ్లీ నియోజకవర్గంగా అయ్యేవరకు సాధించేవరకు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని సాధన కమిటి అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే టైగర్ జోన్ పేరుతో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు లేవు నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు సమస్యల చుట్టు జన్నారం ఉంది ఏం చేయాలో తెలియక అనేకమంది వృత్తిగా భావించిన వివిధ కులాలు రోజువారి కూలీలు పనులేగా పస్తులుఉండే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జన్నారం మండలంలో దాదాపుగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర కులాలు జనాభా దాదాపు 60 వేల నుండి 70 వేల వరకు ఉంది పేరుకు మాత్రమే జనాభా ఉన్న అభివృద్ధి మాత్రం జరగడం లేదు వివిధ గ్రామాలలో గిరిజన గ్రామాలలో అభివృద్ధి చేయడానికి ఇల్లు నిర్మాణం చేపట్టడానికి లేదా వాగులపైన బ్రిడ్జిలు కలువాట్లు గ్రామాలలో రోడ్లు వేయడానికి వేయించడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది కొత్త పరిశ్రమలు లేవు గురుకులాలు లేవు ఉన్నంత కళాశాలలు లేవు అభివృద్ధి జరగాలంటే ఒకే ఒక మార్గం జన్నారం అసెంబ్లీ నియోజకవర్గం కావాల్సిన అవసరం ఉన్నప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తిచేస్తు అదే విధంగా ప్రభుత్వం కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు గానీ అన్ని రకాలుగా ఆలోచించి జన్నారం మండలాన్ని అసెంబ్లీ నియోజక వర్గం చేయాలని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ కూడా చేయడం జరుగుతుం దన్నారు. జన్నారం అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేసేంతవరకు దశల వారిగా ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు. ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో జన్నారం అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేసి ప్రభుత్వాలకు మరియు కమిటీలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని గవ్వల శ్రీకాంత్ అన్నారు.అత్యవసర సమావేశంలో జన్నారం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులుగా గవ్వల శ్రీకాంత్ ఉద్యమ నాయకులు కో కన్వీనర్ లు శ్రీరాముల భూమచారి, శ్రీరాముల గంగాధర్ కొండపల్లి మహేష్, కోడిజుట్టు రాజన్న,గోనె నగేష్, గోల్కొండ రాజన్న, గడ్డం విజయ్, సయ్యద్ రిజ్వాన్, కుందరపు నారాయణ గడ్డం రాజు, శనిగారం నగేష్,గోనె గట్టయ్య, చౌక మహేష్ సిరివెరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :