ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మందుబాబులకు తీపి తీపి కబురు అందింది. రాష్ట్రంలో కొత్తగా 121 లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు 18 కంపెనీలకు చెందిన లిక్కర్ సరఫరాదారులు దరఖాస్తుచేసుకున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో చీతా, టైగర్, రెడ్ హార్స్, అబెస్ట్, ఫ్లెన్స్‌బర్గర్, భూటానిస్, కకావోస్ తదితర పేర్లతో బీర్లు పలు రకాల విస్కీ, వైన్, వోడ్కా, బ్రాందీ, జిన్ టకీలా వంటి బ్రాండ్లు ఉన్నాయి. అయితే బ్రాండ్ల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టిన ఎక్సైజ్ శాఖ ఎలాంటి అభ్యంతరాలున్నా సెప్టెంబర్ 1లోపు ఫిర్యాదు చేయాలని తెలిపింది.
Admin
E Nivas News