Friday, 11 September 2026 08:15:14 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

బట్టకాల్చి మీదేస్తే ఊరుకునే ప్రసక్తేలేదు

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు వార్నింగ్

Date : 06 August 2026 07:54 PM Views : 126

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. గురువారంఆయన మీడియాతో మాట్లాడుతూఈ ఆధునిక యుగంలో కూడా రాష్ట్రంలో వర్షాలు కురవద్దంటూ తాను క్షుద్రపూజలు చేశానని కాంగ్రెస్ నేతలు తనపై నిందలు వేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాల్లో విమర్శలకు కూడా ఓ హద్దంటూ ఉంటుందని ఏదిపడిదే అది బట్టకాల్చి మీదేస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని, ఎవరినీ వదిలిపెట్టనని హరీశ్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే గతంలో కూడా మంత్రి కొండా సురేఖ ఇలాగే నోటికొచ్చినట్లుగా మాట్లాడి ఇవాళ నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారని హరీశ్ రావు అన్నారు. క్షుద్రపూజల ఆరోపణ అంశంలో ఇష్టం వచ్చిన మాట్లాడిన కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ సూట్, పరువు నష్టం కేసును వేయబోతున్నానని ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చానని అన్నారు. మెయిల్ లీగల్ యాక్షన్‌కు ఇంకా 30 రోజుల టైమ్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు, స్కాములనుఎత్తిచూపుతున్న నేపథ్యంలోనే రాజకీయంగా ఎదుర్కోలేక తనపై బురదజల్లేందుకు, డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మైనింగ్ స్కామ్, నాదర్‌గుల్ భూముల వ్యవహారం, గురుకుల టెండర్ల అవినీతి బయటపెట్టామనే ఆక్రోశంలో ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతాంగం నీళ్లు లేక అల్లాడుతుంటే.. దేవాదులలో 10 మోటార్లు ఉన్నా నేటికీ 4 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రజల హక్కులు, రైతాంగం, విద్యార్థుల పక్షాల తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని తగ్గేదేలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: