ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : లక్షెట్టిపేట మండలంలోని జెండావేంకటాపూర్, తిమ్మాపూర్, బలరావుపేట, ఎల్లారం, హాజీపూర్ పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డిసిపి భాస్కర్ గురువారం పరిశీలించారు. మెదటి విడుత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండడంతో మంచిర్యాల జోన్ జెండావేంకటాపూర్, తిమ్మాపూర్, బాలరావుపేట, ఎల్లారం, హాజీపూర్ మండలం లో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సందర్శించి పోలీస్ బందోబస్త్ తో పాటు మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీంచారు. ఈ కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ, కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెల్లడించే వరకు అధికారుల, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి చూడాలని అధికారులను ఆదేశించారు.
Admin
E Nivas News