ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల జిల్లా రాజరాంపల్లి అధ్యక్షులు లయన్ వన్నెల అంజనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు లయన్ వెన్నెల అంజనారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అంజిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని 20 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైక్రో క్యాబినెట్ సామ ఎల్లారెడ్డి, జిల్లా క్యాబినెట్ సభ్యులు కుంట మల్లారెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, సత్యనారాయణరావు, దుంపేటి తిరుపతి, కార్యదర్శి గడ్డం నందిరెడ్డి,తుమ్మల రమణారెడ్డి, ఏలేటి భాస్కర్ రెడ్డి లు పాల్గొన్నారు.
Admin
E Nivas News