ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్లపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క వాహణ దారునికి అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం లక్షేట్టి పేట పట్టణంలోని కళాంజలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డ్రైవర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని కమిషనర్ తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్, టాటా ఏసీ యాజమాని తమ వాహనాలు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఫిట్నెస్, మరియు లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ఓవర్లోడ్ తీసుకెళ్లరాదని అది ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలని లేనిచో వారు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రవాణా శాఖ అధికారి గోపీ కృష్ణ ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఏ ఎంవీఐలు ఖాసీం, సూర్య తేజ, లెనిన్ లక్షట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తదితర సంబంధిత అధికారులు ఆటో డ్రైవర్లు , స్కూల్ బస్సు డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, వాహన యాజమాన్లు పాల్గొన్నారు.
Admin
E Nivas News