Monday, 14 September 2026 07:18:04 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బండి భగీరథ్ కేసుపై సీఎం సీరియస్..! తక్షణమే విచారణకు ఆదేశం...

Date : 11 May 2026 09:34 PM Views : 120

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌‌ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపైన తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు. మే 8న ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసు వివరాలను సీఎంకు డీజీపీ వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలియజేశారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని డీజీపీ ఆనంద్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బండి భగీరథ్‌పై ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు వచ్చింది. తనను భగీరథ్‌ వేధిస్తున్నారని, పోక్సో కింద కేసు నమోదు చేయాలని ఓ మైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు భగీరథ్‌‌పై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయనట్లు తెలుస్తోంది. ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కుమారుడిని ప్రభుత్వమే కాపాడుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :