Sunday, 13 September 2026 11:58:31 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

సిపి. అంబర్ కిషోర్ ఝా

Date : 01 January 2026 11:31 PM Views : 252

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న కీలక చర్యగా తీసుకున్నామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా,రోడ్డు భద్రతపై రూపొందించిన ‘అరైవ్–అలైవ్’ పోస్టర్‌ సిపి కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరైవ్–అలైవ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం, మైనర్ డ్రైవింగ్ చేయరాదనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకోవడం, రాత్రి సమయంలో రోడ్డు ఇరువైపులా వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులు,ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపించవని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతివేగం, ఓవర్‌టేకింగ్‌కు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని, తప్పనిసరిగా లో-బీమ్ హెడ్‌లైట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. వాహనాల మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని,అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, లేన్ మార్చడంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వలన వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు.నిర్దిష్ట వేగంతో వాహనాలు నడపడం ద్వారా స్కిడింగ్‌ను నివారించవచ్చని చెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించి,తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :