ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండల కేంద్రంలో రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి అవసరమైన స్థలాన్ని గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ రామచందర్, మాజీ ఎంపీపీ సృజన నర్సింగరావు, ఏసిపి కిరణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, నూతన కార్యాలయ భవన నిర్మాణానికి అనువైన స్థలం, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు సౌకర్యవంతమైన, ఆధునిక వసతులతో కూడిన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. భవన నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరితగతిన ముందుకుతీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,సంబంధిత అధికారులుతదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News