ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరమైనదనవి డ్రగ్స్ అని వాటిని నిర్మూలించకపోతే వ్యక్తిగతంగా, సమాజానికి తీరని నష్టం జరుగుతుందని మంథని రెండొవ ఎస్సై సాగర్ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ ఆధ్వర్యంలో కో కరికులర్ యాక్టివిటీలో భాగంగా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై డి సాగర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఇలాంటి ఆలోచన రావడము చాలా అభినందనీయమన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల్లో డ్రగ్స్ వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాంపై అవగాహన కల్పించాలన్నారు. ఇది కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరమైనదని దీనిని నిర్మూలించకపోతే మానవ మనుగడకే ప్రమాదము న్నారు. డ్రగ్స్ ను నిర్మూలించడం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల యువత చెడు దారి పడుతుందన్నారు. మత్తు పదార్థాలను నిర్మూలించకపోతే సమాజము పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయమై చెడిపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, పావని, స్రవంతి పోలీసులు, పోలీసు అధికారులు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News