Friday, 11 September 2026 08:13:20 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి...

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

Date : 14 August 2026 10:12 PM Views : 85

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండలం సోమనపల్లిలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను డి.ఈ.ఈ., ఈ డబ్ల్యు ఐ డి సి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ క్రమంలో నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో పంట కుంట మార్కింగ్ పనులను పరిశీలించి నిబంధనల ప్రకారం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం భీమారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిపాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వంటశాల, పారిశుధ్యం, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలనిఅధికారులు, గుత్తేదారును ఆదేశించారు. పాఠశాలలోవిద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధన, వసతి, భోజనం నాణ్యత అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్ లైన్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారంఅందించాలని, పరిశుభ్రతఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, హాజరు పట్టికలు, నిర్వహణ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :