ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి మాత కన్యాకపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధల నడుమ మహా శోభాయమానంగా నూతన ద్వజస్తంభ ప్రతిష్ఠాపన మరియు నవగ్రహాల ప్రతిస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రెండు రోజులపాటు హోమాలు, ప్రత్యేక పూజలు, వేదమంత్రఘోషల మధ్య ఈ పవిత్ర కార్యం విజయవంతంగా పూర్తఅవుతుంది. భక్తులుదాతలు, శ్రీ వాసవి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి మాత ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. వేదపండితుల మంగళవాద్యాలు, దీపారాధన, మంత్రోచ్చారణలతో ఆలయ వాతావరణం మరింత పవిత్రంగా మారింది. మహోత్సవంలో పాల్గొన్న దాతలకు ఆలయ కమిటీ ప్రత్యేక సత్కారం చేశారు. నూతన ద్వజస్తంభం ప్రతిమను ప్రతిష్ఠించి, నవగ్రహాల ఆవాహనతో భక్తులందరూ పునీతమైన క్షణాలను అనుభవించారు.ఈ పుణ్యకార్యక్రమం ముగింపు సందర్భంలో అన్నదానం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమానికి స్థానిక ప్రజలు, భక్తులు, మహిళా సంఘాలు, యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు కొత్త వెంకటేశ్వర్లు, మైలారపు సుధాకర్, తాటి కొండ శ్రీనివాస్, పాలకుర్తి లచ్చన్న, మాజీ మున్సిపల్ చేర్మెన్ నల్మస్ కాంతయ్య, మాజీ వార్డ్ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్ మరియు భక్తులు, పాల్గొన్నారు.
Admin
E Nivas News