Tuesday, 28 July 2026 07:00:03 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Date : 05 December 2025 07:27 PM Views : 360

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ మొదటి విడత పోలింగ్ జరిగే కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం, శ్రీరాంపూర్ మండలాలలోని ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సంబంధించి డిసెంబర్ 6న పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిడివో కార్యాలయం వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పంపిణీ నిబంధన ప్రకారం సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల, రిసెప్షన్ సెంటర్లో వద్ద ఏర్పాట్లు పై కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం మంథని పట్టణంలోని శ్రీపాద మార్గ్ 4 లైన్ విస్తరణ పనుల కోసం అలైన్మెంట్ ను కలెక్టర్ పరిశీలించి ట్రెంచ్ కట్టింగ్ పనులు సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వింటే మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, జడ్పీ సీఈఓ నరేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :