Sunday, 13 September 2026 01:39:14 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల,420 హామీల చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శన...! నాయకుల భారీ ర్యాలీ...

Date : 02 September 2026 08:10 PM Views : 75

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల విఫల పాలనపై, బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర చౌరస్తా నుండి మార్కెట్ రోడ్ నుండి బస్టాండ్ బస్టాండ్ మీదగా బెల్లంపల్లి చౌరస్తా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను మరియు 420 హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రజలకు పంచుతూ,420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు,420 హామీలు 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చిందని అన్నారు. 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న హామీలను 1000 రోజులు పూర్తి అయిన ఎందుకు అమలు చేయడం లేదని వారు అడిగారు. అబద్ధపు హామీలతో గెలిచిన తర్వాత హామీలను గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్షాలను తిట్టడమే, కొట్టడమే,అక్రమ కేసులు పెట్టడమే ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల కి A1 అని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతిపక్ష బి ఆర్ ఎస్ నాయకులను బెదిరించడం,కొట్టడం ఎవరైనా ఎదురుతిరిగితే జైల్లోకి పంపించడం తప్ప మంచిర్యాల ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేసింది ఏమీ లేదని అన్నారు. అధికారులను మరియు గుండాలను అడ్డుపెట్టుకొని మంచిర్యాలలో అన్ని వర్గాల ప్రజల వద్ద నుండి 500 కోట్లను ఈ A1 ఎమ్మెల్యే దోచుకున్నారని తెలిపారు. మంచిర్యాల లో దోచుకోవడానికి మరో ఆస్త్రంగా G.O.22A నిషేధిత జాబితాలో 10332 ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టి మరల ప్రజల వద్ద నుండి దోచుకోవడానికి ఎమ్మెల్యే సిద్ధమయ్యారని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని ఇకపై ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని,ఇవ్వని పక్షంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపినేని మహిళలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని వెంటనే నెరవేర్చాలని వారి డిమాండ్ చేశారు. రైతులకు దురదృష్టవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగి చనిపోతే, రైతు బీమా 5 లక్షలు రూపాయలు రైతు కుతి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందజేసేదని గుర్తు చేశారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బీమాకు కనీసం ప్రీమియం కూడా కట్టడం లేదని తెలిపారు. అదేవిధంగా జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చారని అన్నారు.

ప్రజలను, విద్యార్థులను వ్యాపారస్తులను, ఆటో డ్రైవర్లను, ఆడపడుచును ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని వారు వెంటనే వారి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రుల కుమార్తె ఎదిరిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అన్యాయ పాలనను చూసి, అహంకార ధోరణి చూసి సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగుతున్నారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు దుర్మార్గపు పాలనలో మొదలుగా ప్రతిపక్ష నాయకులపై ఆ తర్వాత ప్రజలపై దాడులు చేశారు, ఇప్పుడు సొంత పార్టీ నాయకులపై కూడా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి A1 రేవంత్ రెడ్డి అని అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు A1 ప్రేమ్ సాగర్ రావని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాదు, A1 ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన విభాగ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు భారీగా పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :