Friday, 11 September 2026 07:39:54 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 08 September 2026 10:08 AM Views : 38

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి .చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మందమర్రి మండలం యాపల్ ప్రాంతానికి చెందిన గాజుల ఈశ్వరి తన భర్త చనిపోయారని, దినసరి కూలీగా పనిచేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నానని నిరుపేద అయిన తనకు రెండు పడక గదుల ఇల్లు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణం తెలంగాణ నగర్ కు చెందిన బి.కస్తూరి తన ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి ఏర్పాటుచేసిన సపోర్టు వైరు ప్రమాదకరంగా ఉందని, తొలగించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గడ్డం ముకుందర్ రెడ్డి తనకు గల వ్యవసాయ భూమిని ఎల్లంపల్లి ప్రాజెక్టులో రికార్డు నుండి తొలగించారని, రైతుబంధు, రుణమాఫీ రాకపోవడంతో నష్టపోతున్నానని, రికార్డులు సవరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కల్లు సునీత తాను నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన బిల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తుఅందజేశారు. లక్షెట్టిపేట మండలం తలమల గ్రామానికి చెందిన పూసం రత్తుబాయి తాను జి.ఎన్.ఎం. పూర్తి చేశానని, చందారం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తల సేమియా వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కాసర్ల శ్రీనివాస్, చుంచు శంకర్ వర్మ తమ దరఖాస్తులో ప్రతినెల 1 వేయి యూనిట్ల రక్తం సేకరించే విధంగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వార్షిక రక్తదాన క్యాలెండర్ రూపొందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. మందమర్రి మండలం విద్యానగర్ కు చెందిన మాచర్ల చైతన్య తాను విద్యానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆయాగా విధులు నిర్వహిస్తున్నానని, ఆర్డర్ కాపీ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులనుక్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :