ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణ రాష్ట్ర ఏర్పటులో కీలక పాత్ర పోషించి అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు చేరేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో చైర్మన్, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులను వర్దిల్లు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతీ కోరారు. వర్దిల్లు తెలంగాణ ఉద్యమ సంస్థ ద్వి దశాబ్ది సన్నహాక సమావేశం మంగళవారం మంథనిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006 లో ఆవిర్బావమైన ఈ ఉద్యమ సంస్థ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి, ఐటి శాఖా మంత్రులతో పాటు కే కే నేతృత్వం లోని కమేటీ సభ్యుల తో ప్రాతినిధ్యం చేయనున్నామన్నారు. ఇరవై వసంతాల ఉత్సవాన్ని పురస్కరించుకొని మంథని నియోజకవర్గం లో పోరుబాట పట్టిన ఉద్యమ కారులను స్వాగతిస్తున్నమన్నారు. ఉద్యమకారుల ఐక్య వేదికగా మంథని చౌరస్తా లో పోష్టర్ల ఆవిష్కరణ చేస్తున్నామన్నారు. ఈ సందర్బంగా ఫోటో ఎగ్జబిషన్, బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర పోరాట శ్రేణులకు సత్వరమే ప్రయోజనాలు కలిపించేలా ముందుకేగుతామని, నేటి నుంచి శుక్రవారం వరకు నిర్వహించే ఉద్యమకారుల సంక్షేమ బావుటా లో మంథని నియోజకవర్గ స్థాయి ఉద్యమ కారులు పాల్గోని సంఘీభావం తెలుపాలని వర్దిల్లు తెలంగాణ ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతి కోరారు.
Admin
E Nivas News