ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం తన ఉద్యోగ ప్రస్థానంలో సిల్వర్ జూబ్లీ ఇయర్స్(25) పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఆర్ బిసి కాలనీలోని, మానవతా నిలయం వృద్ధాశ్రమంలో మరియు కర్నూలులోని, కృపా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, అందరి మన్ననలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సబ్ రిజిస్టర్ కే.అబ్దుల్ కరీం మాట్లాడుతూ దేవుని దయ వల్ల, ఈ రోజు నేను రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ లో చేరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాననీ అన్నారు. నా తండ్రి కూడా ఇదే శాఖలో సేవలందిస్తూ 2001 సంవత్సరంలో స్వర్గస్తులయ్యారనీ, ఆయన ఉద్యోగం నాకు రావడం నా జీవితంలో ఒక గొప్ప బాధ్యతగా, అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు. 10-09-2001న జూనియర్ అసిస్టెంట్ గా నా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమై, అనంతరం సీనియర్ అసిస్టెంట్ నుండి సబ్ రిజిస్టర్ గ్రేడ్- 2, ప్రస్తుతం సబ్ రిజిస్టర్ గ్రేడ్-1 స్థాయికి ఎలాంటి ఆరోపణలు లేకుండా, దేవుని(అల్లా) దయతో మరియు పెద్దల ఆశీస్సులతో ఎదగడం జరిగిందన్నారు. ఈ 25 సంవత్సరాల ప్రయాణం కేవలం నా ప్రయాణం కాదు, నన్ను నడిపించిన, నన్ను ప్రోత్సహించిన, నాకు అండగా నిలిచిన ఎంతోమంది గొప్ప వ్యక్తుల ప్రయాణం కూడా నాకు ఉందన్నారు. ఈ ప్రయాణంలో నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన లెజెండ్స్ చాలామంది ఉన్నారు అన్నారు. ఆ దేవుని(అల్లా)కి నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు దువా చేస్తున్నానని అన్నారు. మా తల్లిదండ్రులకు వారి ఆశీస్సులు, విలువలు, మార్గదర్శకత్వం నా జీవితానికి ఎంతో బలం అని అన్నారు. మా కుటుంబ సభ్యులు, బంధువులు మరియు నా శ్రేయోభిలాషులకు ప్రతి సందర్భంలోనూ నాకు అందించిన ప్రేమ, ప్రోత్సాహం మరియు అండదండలు నాకు ఇచ్చారన్నారు. నా గురువులకు నాకు జ్ఞానం, క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పినందుకు, నా స్నేహితులకు నా జీవిత ప్రయాణంలో ఎల్లప్పుడూ నాకు తోడుగా నిలిచినందుకు, మా రిజిస్ట్రేషన్ శాఖ కుటుంబ సభ్యులందరికీ ఆఫీస్ సబ్-ఆర్డినేట్ నుంచి మా కమిషనర్ గారి వరకు ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాననీ అన్నారు. ఆఫీస్‌లో పని పరంగా నాకు తోడుగా ఉన్న ప్రైవేట్ సిబ్బందికి, డాక్యుమెంట్ రైటర్లు మరియు స్టాంప్ వెండర్లకు నా విధి నిర్వహణలో సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాననీ అన్నారు. మీడియా మిత్రులందరికీ, మీ సహకారం, ప్రోత్సాహానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాననీ అన్నారు. ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాననీ, ఈ అవకాశాన్ని కల్పించిన ఆ దేవుని(అల్లా)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాననీ అన్నారు. ఒక చిన్న సేవా కార్యక్రమం నాదని అన్నారు. ఈ 25 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని, నా సంతోషాన్ని అనాధలతో,ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశంతో కర్నూలులోని, కృపా వృద్ధాశ్రమంలో నందు టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు, బిస్కెట్లు, ఫ్రూట్స్, కొద్దిపాటి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందనీ, అలాగే కరివేనలోని, మానవతా వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ మన సంతోషంలో కొంత భాగాన్ని పేదలతో, ఇతరులతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మన వయస్సు పెరిగే కొద్దీ, మన జీవితపు చివరి దశకు మనం దగ్గరవుతున్నామని గుర్తుంచుకోవాలనీ అన్నారు. కాబట్టి మనకు ఉన్నంతలో, మనకు సాధ్యమైనంతవరకు ఇతరులకు సహాయం చేద్దాం అని అన్నారు. నాలాగే, మీరందరూ కూడా ఇతరులకు సహాయం చేయండి అని పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల ఈ సమాజ సేవా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ అన్నారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసి, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు, మీరందరికి ఉండాలని కోరుకుంటూ దువా చేశారు. నిరంతరం చేస్తున్న సమాజసేవా కార్యక్రమాలకు గుర్తింపుగా సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం కి ఆఫీస్ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, తదితరులు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృద్ధాశ్రమం నిర్వాహకులు, వృద్ధులు, అనాధలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News