Monday, 14 September 2026 04:02:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 14 January 2026 05:49 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మే 21 నుండి జూన్ 1 వరకు మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కాళేశ్వరం దేవాలయ ఈఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్కిటెక్చర్, ఇరిగేషన్, పంచాయతీ రా జ్ ఇంజనీరింగ్ శాఖల అధి కారులతో జిల్లా ఎస్పీ సిరిశె ట్టి సంకీర్త్ తో కలిసి సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వ హిం చిన సరస్వతి ఆది పుష్క రాలను దృష్టిలో ఉంచుకొ ని,అంత్య పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా సౌక ర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత పుష్కరాలలో ఎదురై న సమస్యలు పునరావృ తం కాకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలనితెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.30.16 కోట్ల నిధులను మంజూరు చేసిందని,ఇందులో రూ.16 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్ట నున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలని, ఫిబ్రవరి మొదటి వారంలోపే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదే శించారు.కాళేశ్వరం మా స్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శాశ్వత పనులు చేపట్టా లని,పుష్కరాల సమయం లో భక్తుల రాకపోకలు, భద్రత, తాగునీరు, పారిశు ధ్యం, వైద్య సేవలు, విద్యు త్ సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేయాలని తెలిపారు. కాళేశ్వరానికి వచ్చే భక్తులకు సౌకర్య వంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ సరస్వతి అంత్యపు ష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా పోలీస్ శాఖ తర పున ప్ పటిష్టమైన బందో బస్తు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ,వాహ నాల పార్కింగ్,భక్తుల భద్రత వంటి అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక రహ దారి మార్గాలను పరిశీలి స్తున్నామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పా టు చేస్తామని తెలిపారు. వాహనాల పార్కింగ్ సమస్యలు నివారించేం దుకు మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాలను గుర్తించామని, ప్రైవేట్ వాహనాల నియం త్రణకు డ్రాప్ గేట్లు ఏర్పా టు చేస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరి మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలను ఆది పుష్కరాల మాదిరిగానే అత్యంత వైభవంగా నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంత్య పుష్కరాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న దేవాదాయ శాఖ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా త్వరలోనే కాళేశ్వర ఖండం అనే పుస్త కాన్ని విడుదల చేస్తామని తెలిపారు. పీఠాధిపతులు, హారతి,ఇతర తాత్కాలిక ఏర్పాట్ల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందిం చాలనిసూచించారు.అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేయాలని కోరారు. ఈసమావేశంలో సబ్ కలెక్టర్ మాయం సింగ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :