ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధనకు అద్యాపకులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని పెద్దపెల్లి జిల్లా నోడల్ ఆధికారిని కల్పన సూచించారు. సోమవారం పట్టణంలోని బాలుర,బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఫలితాలపై చర్చించారు. త్వరగా సిలబస్ పూర్తి చేసి రివిజన్ కు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైన నేపథ్యంలో పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులకు ముఖ గుర్తింపు ద్వారా హాజరు శాతాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు. కళాశాలకు హాజరు కాకపోతే పరీక్ష ఫీజు చెల్లింపు సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షల్లో విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ఎంతో కీలకమైన ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి రికార్డులను తనిఖీ చేశారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News