ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరింత వేగంగా కొనసాగుతుంది. కార్మిక–గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో మంగళవారం చెన్నూరు క్యాంప్ ఆఫీస్‌లో భారీగా చేరారు.కొమ్మెర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సత్యానంద్ గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల ప్రభావంతో0 తమ గ్రామస్తులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారని నేతలు తెలిపారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని, గ్రామాల వారీగా సమన్వయంతో పని చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకులకు సూచించారు. క్యాంప్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
Admin
E Nivas News