ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మేర జయలక్ష్మి ఎన్నికల ప్రచారంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివివేక్ పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలిసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి ఓటర్లను కోరారు. అదేవిధంగా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుంకరి శిరీష తరఫున కూడా మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి వివేక్ ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News