Sunday, 13 September 2026 06:19:46 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

పురపోరులో ‘పొంగులేటి’ మ్యాజిక్ షో..

10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం... 70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు...

Date : 14 February 2026 09:11 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : శీనన్న వ్యూహంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం... తెలంగాణ చీఫ్ బ్యూరో ఫిబ్రవరి 14 :- ఖమ్మం మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంతన్న అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకున్న ఆయన, తన వ్యూహ చతురతతో ఫలితాలను తలకిందులు చేశారు. కేవలం అంకెలే కాదు.. ఆ అంకెల వెనుక ఉన్న ఆయన కష్టం, ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 10 రోజుల్లోనే అసాధ్యమనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేసి చూపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శీనన్న అడ్డాలో తిరుగులేని హవా... తన సొంత గడ్డపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాలివాటం కాదు.. సునామీ సృష్టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఏదులాపురం లో.. 32 వార్డుల్లో ఏకంగా 24 చోట్ల జయకేతనం ఎగురవేసి సత్తా చాటారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో... సింగరేణి హృదయంలో 22 స్థానాలను కైవసం చేసుకున్నారు. కల్లూరు & సత్తుపల్లి లో... కల్లూరులో 12, సత్తుపల్లిలో 17 వార్డులను హస్తం ఖాతాలో వేశారు. ఇల్లందు&అశ్వారావుపేట లో... ఇక్కడ కూడా ఇల్లందులో 19, అశ్వారావుపేటలో 17 స్థానాల్లో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. ఓరుగల్లు కోటపై హస్తం జైత్రయాత్ర.... రేవంతన్న ఆశీస్సులతో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను స్వీకరించిన శీనన్న, అక్కడ కూడా ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొట్టారు.భూపాలపల్లి..అత్యంత కీలకమైన ఈ మున్సిపాలిటీలో 16 వార్డులను గెలుచుకుని పట్టు సాధించారు. పరకాల & స్టేషన్ ఘన్‌పూర్...పరకాలలో 13, స్టేషన్ ఘన్‌పూర్‌లో 13 స్థానాలను గెలిపించి జిల్లాలో కాంగ్రెస్ ప్రాభవాన్ని చాటారు. గణాంకాలే సాక్ష్యం.. 249 వార్డుల ప్రచారం.. 174 స్థానాల్లో విజయం!* మొత్తంగా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలను గెలుచుకుంది. అంటే సుమారు 70 శాతం గెలుపు రేటుతో ఆయన 'మోస్ట్ సక్సెస్‌ఫుల్' లీడర్‌గా నిలిచారు. పగలు రేయి ఏకంచేసి ఆయన సాగించిన సుడిగాలి పర్యటనలు, రేవంతన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కల్పించిన భరోసా ఓట్ల వర్షంగా కురిసింది. మాట ఇస్తే తప్పని నైజంతో, అభివృద్ధిపై ఉన్న నిబద్ధతతో శీనన్న ప్రజాప్రభుత్వంలో తన మార్క్ రాజకీయాలను మరోసారి చాటిచెప్పారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :