Saturday, 12 September 2026 09:29:17 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది..! మాజీమంత్రి జగదీశ్ రెడ్డి..

Date : 01 September 2026 09:04 PM Views : 66

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలుప్రజాసమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన పత్రికల సమావేశం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అంటే అనుక్షణం భయంతోనే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఎక్కువగా గుర్తు చేసుకునే వారిలో రేవంత్ రెడ్డిదే ప్రథమ స్థానమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో లెక్కలు తీయడానికి సిద్ధమాఅని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. వెలుగొండపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదని ప్రశ్నించారు. కళ్లముందే నీరు కనిపిస్తున్నా ఆ నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే అడ్డుకోలేని పరిస్థితికి ప్రభుత్వ అసమర్థత, అవినీతే కారణమని ఆరోపించారు. పాలమూరుకు ద్రోహం రేవంత్ చేస్తున్నాడన్నారు. తనకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన మహబూబ్‌నగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాంతంలో మళ్లీ వలసలు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమవుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా జిల్లా మంత్రులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్, తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టామని, ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్‌కు ఎదురుగా వచ్చే దమ్ము నీకుందా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. బుధవారం నుంచి పోరుబాట మిర్యాలగూడలో కేటీఆర్ రైతు సభ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రేపటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలోపోరుబాట ప్రారంభమవుతుందని జగదీశ్ రెడ్డి ప్రకటించారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభంపై కేటీఆర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో భారీ రైతు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా సభను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :