ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ సహా ఇతర తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, రక్షణ రంగ పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం వంటి విషయాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ హామీ ఇచ్చారు.
Admin
E Nivas News