Sunday, 13 September 2026 12:52:15 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లి సమయం ఆసన్నమైంది...

మాజీ మంత్రి కేటీఆర్

Date : 05 July 2026 10:48 PM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లి సమయం ఆసన్నమైందని మాజీమంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదివారం కన్నెపల్లి పంపు హౌస్ కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.పోలీసులఆంక్షలు, అడుగడు గునా ఎదురైన అడ్డంకులను అధిగ మించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 8 గంటల కు బయలుదేరిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో 3 గంటల్లో చేరుకోవా ల్సిన ప్రయాణానికి మధ్యాహ్నం 8గంటల సమయం పట్టిం దని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణకు నీళ్లివ్వాలని కేసీఆర్ మహాయజ్ఞంలా కాళేశ్వరాన్ని నిర్మించారని, తాము ఇక్కడికి ఎవరినో నిందించడానికి లేదా, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరం బాసర నుండి గోదావరి పారుతు న్నా సమైక్య రాష్ట్రం లో తెలంగాణ ఎడారిలానే ఉండిపో యిందని, నీళ్ల కోస మే ఆనాడు ఉద్య మం చేశామని కేటీ ఆర్ గుర్తుచేశారు. పల్లం నుంచి నీటిని పైకి తేవచ్చని, మనం కూర్చున్న చోట 90 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నా యని కాళేశ్వరం నిరూపించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు గతంలో తుమ్మిడిహట్టి దగ్గర కడతామని ప్రజల ను మభ్యపెట్టారని, ఆనాడు మహారాష్ట్ర కు 152 మీటర్ల ఎత్తు పెంచవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ జల దౌత్యం జరిపి, మూడున్నరే ళ్లలో చర్యలు తీసు కుని, గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండే లా కన్నెపల్లి దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో ఒక బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగితే కూలేశ్వరం’ అంటూ కాంగ్రెస్ నేతలు కుట్రపూరిత ప్రచా రం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజ మెత్తారు. ఎన్నికల ముందు పిల్లర్లు కుంగిన ఘటనపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. రెండు పిల్లర్లు కుంగిన బ్లాక్ పునర్నిర్మాణానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే అవుతుందని, అది కూడా ప్రభుత్వంపై ఒక్క పైసా భారం పడకుండా నిర్మాణ సంస్థే పూర్తి చేస్తానని చెప్పినా ప్రభుత్వం పనులు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయం చేయడానికి ఇక్కడి కి రాలేదు కెసిఆర్, పట్టుదలతో 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాలే శ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి, జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుం దని, వర్షాలు కురవకపోయినా కన్నెపల్లి వద్ద నీరు ఎప్పుడు నిలువ ఉంటుందని అన్నారు. మీకు చేతకాకపోతే కేసీఆర్ కు కాలేశ్వ రం ప్రాజెక్టు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బారాస ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, hకౌశిక్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు నడిపెల్లి దివాకర్ రావు, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :