Friday, 11 September 2026 09:33:47 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి..

ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు

Date : 07 August 2026 09:07 PM Views : 97

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రాన్ని తమ పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు సమావేశంలో ఆయన మాట్లాడారు. బే ఏరియాలోని ఐటీ, వైద్యం, మానవ వనరుల రంగాలకు చెందిన ప్రముఖ ఎన్నారైలు, వ్యాపార నాయకులు హాజరైన ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను డిప్యూటీ సీఎం సుదీర్ఘంగావివరించారు. హైదరాబాద్ నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాల్లో భారతదేశంలోనే అగ్రగామి కేంద్రంగా ఎదుగుతోందని ఆయన గుర్తుచేశారు. పారదర్శక పరిపాలన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రభుత్వపెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోందని తెలిపారు. నూతన ఆలోచనలను వ్యాపారాలుగా మార్చడంలోనూ, నాణ్యమైన ఉపాధి కల్పనలోనూ పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో చేపడుతున్న కీలక ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.. మూసీ నది పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ యువతను అంతర్జాతీయ స్థాయి పోటీకి సన్నద్ధం చేసేందుకు ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు మాట్లాడిన కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి ప్రవాస భారతీయులు, ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు బలోపేతం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఐఓసీ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధిపై ఎన్నారై ప్రతినిధులతో నిర్వహించిన ఈ చర్చలు ఎంతో ఉత్సాహంగా సాగాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :