Wednesday, 29 July 2026 12:08:14 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

దొంగతనం కేసులో భార్యాభర్తల అరెస్ట్

బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం డిఎస్పి రఘు చందర్

Date : 06 February 2026 09:14 PM Views : 195

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 3న అర్ధరాత్రి సమయంలో ఆలయ తాళం పగలగొట్టి దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు మరియు హుండీలోని నగదును దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.4,357/- నగదుతో పాటు దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై ఆలయ పూజారి సముద్రాల జగన్మోహన్ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్64/2026 కింద 331(4), 305(a) బి.ఎన్.ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సై ఎం. సుప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి6 న కరీంనగర్ రోడ్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, పంచల సమక్షంలో వారిని విచారించారు. విచారణలో వారు ఆలయంలో జరిగిన దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :