Sunday, 13 September 2026 02:04:35 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ సర్కార్

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితఆగ్రహం

Date : 01 February 2026 11:39 PM Views : 138

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరుసగా 12వ ఏడాది కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారంఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు . కేంద్ర బడ్జెట్ పై ఎక్స్ వేదిక స్పందించారు.పన్నేండేళ్లుగా తెలంగాణను మోసం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆమె ట్వీట్ చేశారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ప్రధాని మోడీ నిత్యం చెబుతుంటారు కానీ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు సహా తెలంగాణ ప్రాజెక్ట్ లకు రావాల్సిన నిధులన్నింటినీ పెండింగ్ లో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అంటూ నినాదాలు చెప్పే బీజేపీ పెద్దలు తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

8 మంది ఎంపీలను ఇస్తే తిరిగి ఇచ్చింది గుండుసున్నా....

తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి మాత్రం గుండుసున్నా ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావాల్సిన దానికి బదులు పెండింగ్ ఫైల్స్ వస్తున్నాయన్నారు. 34 వేల 367 కోట్ల తో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఇవ్వాల్సిన 50 శాతం నిధులు ఇవ్వలేదన్నారు. కొత్త రైల్వే లైన్స్ కు క్లియరెన్స్ లు ఇవ్వకపోగా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని మండిపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన ఐఐఎం,16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వటం లేదన్నారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగాపారిశ్రామిక ప్రోత్సహాకాలు ఏమీ ఇవ్వలేదన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాంతాడంతా ఉందన్నారు. ప్రధాని మోడీ చెప్పే కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటే తెలంగాణ ప్రయోజనాలను కాలరాయమటేనా అని ప్రశ్నించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: