Friday, 11 September 2026 07:40:16 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మానానికి భూమి పూజ చేసిన ఉపముఖ్యమంత్రి.

రూ.200 కోట్లతో దివ్యక్షేత్ర అభివృద్ధి – భక్తులకు మరింత మెరుగైన వసతులు..

Date : 08 September 2026 10:13 AM Views : 39

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : శతాబ్దాల చరిత్ర, విశిష్ట ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (ఉగ్ర నరసింహ స్వామి) దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం శుభ ముహూర్తాన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, విద్యుత్ శాఖ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి ఘనంగా భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యక్షేత్రాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం దాదాపు రూ.200 కోట్లను కేటాయించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసి వాటి వైభవాన్ని పునరుద్ధరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఆలయాల అభివృద్ధితో పాటు మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.200 కోట్లను కేటాయించడం ద్వారా ఈ క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. రాబోయే **గోదావరి పుష్కరాలను** పురస్కరించుకుని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,000 కోట్లను కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. భక్తులు, యాత్రికులకు సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి పనులను చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని అన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన, భక్తుల ఆకాంక్షలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం భక్తులకు మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ దివ్యక్షేత్రాన్ని తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా చేపడతామని తెలిపారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.భూమి పూజా కార్యక్రమం నిర్ణీత ముహూర్త సమయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :