Tuesday, 15 September 2026 09:31:15 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రెండు పంటకు తక్షణమే సాగునీటిని వెంటనే విడుదల చేయాలి...

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Date : 12 January 2026 10:09 PM Views : 208

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గూడెం లిఫ్ట్ ని బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం సందర్శించారు. అనంతరం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ గూడెం లిఫ్ట్ దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు ఒక జీవన ఆధారం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉండడం వల్లనే మూడు టీఎంసీల గూడెం లిఫ్ట్ మంజూరు అయిందన్నారు. 2015 నుండి గూడెం లిఫ్ట్ ద్వారా రైతులకు అందిస్తున్నా మన్నారు. గతంలో పెద్ద ఎత్తున వర్షాలు పడడం వలన గూడెం లిఫ్ట్ కు సంబంధించిన కేబుల్స్, తెర పరికరాలు పాడైపోయిన సందర్భంలో దాదాపు 11.50 కోట్ల రూపాయలతో కేబుల్ వెడ్స్, ఇతర పరికరాలను ఏర్పాటుచేసి రెండో పంటకు నీరు అందజేసినామన్నారు. గతంలో అధిక వర్షాలతో కడెం గేట్లు తెరుచుకోలేదు అప్పుడు ఎలాగైనా పంటకు నిరంధించాలని, ప్రత్యేక దృష్టి పెట్టి గేట్లు తెరిచేటట్లుగా కృషి చేశామని తెలిపారు. పైపుల ద్వారా నీరు అందించినప్పటికీ మాటిమాటికి పైపులు బాడవుతున్న సందర్భంలో రెండున్నర కిలోమీటర్ల మేరకు నూతన పైప్ లైన్లు వేయించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వాన్నిదని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మరియు గూడెం లిఫ్ట్ మంజూరులో, నిర్మాణంలో ఎవరి ప్రమేయం లేదు ఇది కేవలం దివాకర్ రావు ఘనత అన్నారు. వర్షానికి వైర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు మాటి మాటికి పాడవుతున్న సందర్భంలో 1 కోటి 59 లక్షల రూపాయలతో వైర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వర్షపు నీటిలో తడిచి పాడవకుండా బిల్లింగ్ కూడా మంజూరు చేయించడం జరిగిందన్నారు. రైతులకు నీరు అందక తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఎమ్మెల్యే చెరువు తీసుకొని నీటిని రెండో పంటకు తక్షణమే నీటిని అందించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పంటలు ఎండిపోయాయి అని బిజెపి పార్టీ నాయకులు అవగాహన లేకున్నా విమర్శలు చేస్తున్నారని, తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు నీరు అందించిన విషయం రైతులందరికీ తెలుసన్నారు. దండేపల్లి లక్షెట్టిపేట మండలాల రైతుల ప్రయోజనాల కోసం రెండో పంటకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ నల్మాస్ కాంతయ్య, దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, దండేపల్లి మాజీ వైస్ ఎంపీపీ అనిల్, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :