ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అక్రమ వినియోగం కేసులో రామ లక్ష్మణ్ ఇండస్ట్రీస్ యాజమాని గంప సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేసిరిమాండ్‌కు తరలించినట్లు లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ ఆయన మాట్లాడుతూ రూ. 15.70 కోట్ల రబీ 2022–23, 2023–24 సీజన్లలో ప్రభుత్వ కేటాయించిన 9,244.206 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను, ప్రభుత్వానికి అందజేయాల్సిన 6,286.059 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌లో కేవలం 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లు యాజమాని అప్పగించారు. మిగిలిన 4,452.548 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అక్రమంగా మళ్లించి, సుమారు రూ. 15.70 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. సివిల్ సప్లైయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ కె. శ్రీకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్షేటిపేట సీఐ రమణ మూర్తి, ఎస్సై రాజవర్ధన్ వెల్లడించారు.
Admin
E Nivas News