Sunday, 13 September 2026 12:51:07 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

పెన్షన్ డబ్బుల కోసం కారోబార్ లంచం...

Date : 08 January 2026 07:43 PM Views : 273

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ కారోబార్ సురేష్ తన తల్లికి పెన్షన్ ఇప్పించడానికి పదిహేను వందల రూపాయలు తీసుకుని ఇప్పటికీ ఆ పని చేయలేదని బుసురాజుల రాజు ఆరోపించారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, తన తండ్రి బుసురాజుల మల్లయ్య నాలుగు నెలల క్రితం మరణించగా ఆ వృద్ధాప్య పెన్షన్ ను తన తల్లికి మార్చుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్స్ కోసం పదిహేను వందలు అడుగగా కారోబార్ సురేష్ కు ఇచ్చినట్లు వివరించాడు. గత నాలుగు నెలలుగా తన తల్లికి పెన్షన్ రాకపోవడంతో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాను హైదరాబాద్ లో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారోబార్ లంచవతారం గురించి ఇప్పటికే పాత కొమ్ముగూడెం సర్పంచ్ దుమ్మని సత్యన్నకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. డబ్బులు తీసుకున్నప్పటికి కూడా పెన్షన్ ఇప్పించకుండా మనో వేదనకు గురి చేస్తున్న కారోబార్ సురేష్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :